21 August, 2026 | 4:35 PM

Breaking News

శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం   •   తంగళ్లపల్లి ఎస్‌హెచ్‌ఓ సిరిసిల్ల అశోక్ బాధ్యతల స్వీకరణ   •   పాఠశాల ప్రిన్సిపాల్ రూపా రెడ్డి ఘటనపై ఉట్నూర్ ఏఎస్పీ భరసా   •   సింగరేణి హెల్త్ కార్డుల్లో వ్యత్యాసాలు సరికాదు   •   హల్ద్వానీ ఘటనపై మంథనిలో కాంగ్రెస్ నిరసన   •   అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం: మార్కెట్ చైర్మన్   •   రైతు బీమా, కళ్యాణలక్ష్మి పథకాలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ   •   సరిహద్దులు సురక్షితంగా ఉంటేనే.. భారత్ సురక్షితం   •   విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినియోగదారుల వినతి   •  

కామారెడ్డి జిల్లాలో ఎరువుల దుకాణాలు బంద్

28-04-2026 12:37 AM
  1. రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు బందు పాటించిన 
  2. ఎరువుల దుకాణాల యజమానులు 

కామారెడ్డి, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): రాష్ట్ర ఎరువుల దుకాణదారుల అసోసియేషన్ పిలుపులో భాగంగా సోమవారం కామారెడ్డి జిల్లాలోని జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో  ఎరువుల దుకాణాలు సంపూర్ణ బంద్ పాటించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దుకాణాలు బంద్ చేసి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారస్తులు భాగ్యలక్ష్మి శ్రీనివాస్, చందు, బోనగిరి కృష్ణమూర్తి, లు మాట్లాడుతూ  ఎరువుల ఉత్పత్తిదారులు ఎరువుల సరఫరా పై ఎఫ్ ఓ ఎల్ విధానం అనగా రవాణాచార్జీలు హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

రువుల సరఫరాలో యూరియా, డిఎపి, వాటితోపాటు లింకు విధానంతో వివిధ ఉత్పత్తులను అంట కట్టి ఇటు డీలర్లకు రైతులకు అదనపు భారం మోపటం సరైంది కాదని వెంటనే లింకు విధానాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. డీలర్లకు మార్జిన్  పెంచాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చెరువుల దుకాణాల డీలర్లు, యజమానులు, తదితరులు పాల్గొన్నారు.