calender_icon.png 2 February, 2026 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇలవేల్పుల రాకతో పండుగ వాతావరణం

02-02-2026 01:04:16 AM

మేడారం నుంచి తిరుగు ప్రయాణంలో చతిస్గడ్ గ్రామదేవతలకు సాదర ఆహ్వానం.. 

మొక్కులు తీర్చుకున్న తిప్పాపురం గ్రామస్తులు 

చతిస్గడ్ మోరపల్లి  నుంచి నూప వారి ఇలవేల్పులు 

కన్నుల పండుగగా జరిగిన అంతర్ రాష్ట్ర ఇలవేల్పు పండుగలు

మూడు రాష్ట్రాల నుంచి గిరిజన పూజారులు చర్ల మండలానికి రాక 

చర్ల, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): గిరిజర ఆదివాసీలు ఆచార సంప్రదాయాలకు పెట్టింది నెలవు ఇక్కడి గిరిజన తెగ చత్తీస్గడ్ రాష్ట్రంలోని తమ ఇష్టా దైవాలను  కొలిచి మొక్కే ఆచారం ఈ ప్రాంతం ఆదివాసీలది. ఆదివారం చర్ల మండలంలోని అటవీ ప్రాంతమైన తిప్పాపురం గ్రామంలో గిరిజన ఆదివాసీలు మేడారం సమ్మక్క సారక్క జంపనలను దర్శించుకొని తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మీదుగా తిప్పాపురం గ్రామ సమీపంలోని నూప  వంశస్థుల ఇంటి ఇలవేల్పులను సాధనంగా ఆహ్వానించి ఊరి గ్రామస్తులు మొక్కలు తీర్చుకున్నారు.

చత్తీస్గడ్ రాష్ట్రంలోని మోరపల్లి గ్రామానికి చెందిన ఈ దేవతలు మేడారం అమ్మవార్లను దర్శించుకుని తిరుగు ప్రయాణంలో తిప్పాపురం గ్రామం లో  కాసేపు బాస చేసి చతిస్గడ్ రాష్ట్రంలోని మోరపల్లికి ప్రయాణమై  గిరిజన తెగకు చెందిన గిరిజన ఆదివాసీలు నూప వంశస్థులు తెలియజేశారు. నూప పవారి వంశస్థులుగా  నూప తిరుపతిరావు, మోతీరులు, రఘు, కన్నారావు  రూప నాగేశ్వరరావు, దలపతి  ఇక్కడి గ్రామస్తులు మాట్లాడుతూ కొలసి మొక్కే దేవతలుగా కోరికలు తీర్చే దేవతలుగా మేము నమ్మిన దేవతలను మా ఊరిలో దర్శించుకుని మొక్కులు తీర్చుకొని ఇక్కడి నుంచి సాదరంగా మోరపల్లికి పంపిస్తామని గ్రామస్తులు ఆనంద వ్యక్తం చేశారు.

చర్ల మండలంలోని దోసెలపల్లి గ్రామానికి చెందిన కణితి వారి ఇష్టదైవాలకు నైవేద్య, పూజలు చేసిన ఆదివాసి గిరిజనులు చతిస్గడ్ రాష్ట్రం ,దంతేవాడ జిల్లా బైలడిల్లా నుంచి దేవతామూర్తులు చర్ల మండలానికి ఆగామనం చేశారు, గిరిజనుల ఆరాధ్య దైవమైన  కనీతి వారి ఇలవేలుపులు  చతిస్గడ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లలోని బైలడిళ్ల గ్రామానికి చెందిన మద్దాడి గ్రామం నుంచి కనితివారి ఇలవేల్పుల దైవాలు చర్ల మండలం లోనీ దోసెల్లపల్లి గ్రామం లో రెండు రోజుల పాటు కొలువై ఉన్నారు ఈ సందర్భంగా ఆదివాసి గిరిజనులు కనీతి వారు ఘనంగా పండుగ జరుపుకున్నారు.

అమ్మవార్లను , దేవతామూర్తులను ఊరేగింపు చేసి ఇష్ట దైవ లకు మొక్కలు తీర్చుకొని ఆదివారం దంతేవాడ జిల్లాకు చెందిన దేవతల మూర్తులు తిరుగు ప్రయాణమయ్యాయి, ఈ సందర్భంగా కనితి వారి ఇంట పండుగ వాతావరణం కనిపించింది , ఈ కార్యక్రమానికి ఆంధ్ర ,తెలంగాణ, ఛత్తీస్గడ్ రాష్ట్రాల నుంచి పూజారులు, గిరిజన గురువులు విచ్చేసి పండుగలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దంతవాడ జిల్లా నుంచి ఇలవేల్పులు దళపతి కనితి భీమయ్య, కనితి సోమయ్య,  పూజారులు కణితి తిరుపతిరావు, పూజారి కనితి కృష్ణ పాల్గొనగా,ఆంధ్ర రాష్ట్రం ఎటపాక నుంచి కనితి శ్రీనివాసులు, తెలంగాణ రాష్ట్రం దోసెలపల్లి నుంచి శ్రీనివాస్ ,విజయ్ లు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.