బోనాల పండక్కి మారెమ్మ సందడి
మాస్ మహారాజా రవితేజ సోదరుడైన నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్- డ్రామా ‘మారెమ్మ’తో హీరోగా బిగ్‌స్క్రీన్‌పై అడుగుపెడుతున్నారు. ఇదే సినిమాతో మంచాల నాగరాజు దర్శకు డిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్‌రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. దీపా బాలు కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో వినోద్‌కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, రూపా లక్ష్మి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్, తొలిగీతానికి మంచి స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ మూవీ రిలీజ్ టైమ్‌పై అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రం వచ్చే జూలై నెలలో విడుదల కానుంది. ‘ఈసారి బోనాల జాతర థియేటర్లలో దుమ్ములేపబోతున్నాం’ అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ డివైన్ వైబ్‌తో ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రశాంత్ అంకిరెడ్డి; సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి; సాహిత్యం: మిట్టపల్లి సురేందర్, కమల్ ఎస్లావత్; యాక్షన్: మాడిగొండ నటరాజ్; ఎడిటర్: దేవ్ రాథోడ్; ఆర్ట్: రాజ్‌కుమార్ మురుగేషన్.






