04-12-2025 01:11:24 AM
రాయ్‌పూర్/చర్ల, డిసెంబర్ 3: దండకారణ్యంలో మరోసారి తుపాకుల మోత మోగింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య భీకర పోరు జరిగింది. బీజాపూర్--దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లోని పశ్చిమ బస్తర్ డివిజన్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో మొత్తం 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. అలాగే ముగ్గు రు డిస్ట్రి క్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) జవాన్లు కూడా మృతిచెందారు.
మృతులైన జవాన్లలో హెడ్ కానిస్టేబుల్ మోను వాడది, కానిస్టేబుళ్లు దుకారు గోండె, రమేష్ సోడి ఉన్నారు. మరో జవాను సోమ్‌దేవ్ యాదవ్ అనే మరో డీఆర్జీజీ జవాన్‌కు తీవ్రగాయాలయ్యాయి.బీజాపూర్ ఎస్పీ జితేం ద్ర యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. దంతెవాడ- బీజాపూర్ డీఆర్జీ, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్), సీఆర్పీఎఫ్, కోబ్రా కమాం డో బృందాలు సంయుక్తంగా బుధవారం తెల్లవారుజామున కూంబింగ్ ఆపరేషన్ చేపట్టా యి.
ఈక్రమంలో ఉదయం 9 గంటల ప్రాం తంలో వారికి మావోయిస్టులు తారసపడి కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన భద్రతా దళాలు వెంటనే ఎదురుకాల్పుల ప్రారంభించాయి. ఇరువైపులా సుమారు ఆరగంట పాటు భీకరపోరు సాగింది. జవాన్ల ధాటికి తాళలేని మావోయిస్టులు కాల్పులు జరుపుతూ దట్టమైన అటవీప్రాంతంలోకి పారిపోయారు. అనంతరం జవాన్లు ఆ ప్రాం తాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో 12 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
అలాగే మావోయిస్టులకు చెందిన ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్స్, 303 రైఫిల్స్‌తో పాటు ఇతర ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బస్తర్‌రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాల్సి వుంది. మృతుల్లో మావోయస్టు పార్టీ పీఎల్జీఏ-౨ కమాండర్ మిడియం కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అక్కడి పోలీసు అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. తాజా ఎన్‌కౌంటర్‌తో ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్ ఎదురుకాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టుల సంఖ్య 270కి చేరింది.