6 July, 2026 | 3:52 AM

తిరుమల హుండీలో 15 వేలు చోరీ

27-11-2024 02:00 AM

తిరుమల: తిరుమల శ్రీవారి హుండీలోని నగదును ఓ వ్యక్తి దొంగిలించాడు. 23న ఘటన జరిగింది. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా భద్రతా సిబ్బంది చోరీ జరిగిన విషయాన్ని గుర్తించారు. ఆలయంలోని స్టీల్ హుండీలో నుంచి తమిళనాడు వాసి వేణులింగం చోరీకి పాల్పడినట్టు తేల్చారు.

అదే రోజు నిందితుడిని పట్టుకొని, దొంగిలించిన రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం టీటీడీ విజిలెన్స్ అధికారులు నిందితుడిని పోలీసులకు అప్పగించారు.