ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయండి
29-06-2026 06:25 PM
బోథ్,(విజయక్రాంతి): జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని ఐటీడీఏ పీవో మంద మకరందను కర్త్వాడ గ్రామ సర్పంచ్ ధృవ విశ్వేశ్వర్ న్యాయవాది పంద్రం శంకర్లు విన్నవించారు. సోమవారం వారు ఐటిడిఎపిఓను కలిసి కరత్వాడ పాట్నాపూర్ గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు.






