calender_icon.png 19 July, 2025 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినీ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

19-07-2025 08:26:00 AM

హైదరాబాద్: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో(Tollywood film industry) వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ సినీ నటుడు ఫిష్ వెంకట్(Fish Venkat Passes Away) మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో హైదరాబాద్‌ చందానగర్ లోని ఒక ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయస్సు 53 సంవత్సరాలు. ఫిష్ వెంకట్ అసలు పేరు మంగలంపల్లి వెంకటేష్రెండు కిడ్నీలు విఫలమైనందున గత రెండు వారాలుగా వెంటిలేటర్‌పై ఉన్నారు. అతని కుటుంబం కిడ్నీ దాత కోసం ఎదురు చూస్తోంది కానీ సరిపోయే కిడ్నీ దొరకలేదు. కొన్ని రోజుల క్రితం అతన్ని హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అతని కుటుంబం ఆర్థికంగా సహాయం చేయమని పరిశ్రమ ప్రముఖులను కోరింది కానీ దురదృష్టవశాత్తు కిడ్నీ మార్పిడికి ముందే, ఫిష్ వెంకట్ తుది శ్వాస విడిచారు. ముషీరాబాద్ మార్కెట్ లో చేపల వ్యాపారంతో ఫిష్ వెంకట్ గా ఆయనకు గుర్తింపు వచ్చింది.

ఫిష్ వెంకట్ 100 కి పైగా తెలుగు చిత్రాలలో హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పనిచేశాడు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమా ఫిష్ వెంకట్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. అతను లక్ష్మి, చెన్నకేశవ రెడ్డి, దిల్, అత్తారింటికి దారేది, బన్నీ, గబ్బర్ సింగ్, కింగ్, డీజే టిల్లు, ఆదుర్స్, డాన్ శీను, మిరపకాయ్, దరువు, సుప్రీమ్, కందిరీగ, వరుడు, రెడీ, శౌర్యం, సుడిగాడు వంటి చిత్రాలలో పనిచేశాడు. ఫిష్ వెంకట్ చివరి చిత్రం కాఫీ విత్ ఏ కిల్లర్(2025)లో నటుడిగా కనిపించాడు. ఫిష్ వెంకట్ ఆగస్టు 3, 1971 న మచిలీపట్నంలో జన్మించాడు. 1991 లో జంతర్ మంతర్ తో తన నటనా రంగ ప్రవేశం చేసాడు. ఫిష్ వెంకట్ హైదరాబాద్ రాంనగర్ లో నివాసం ఉంటున్నాడు. నటుడు శ్రీహరి ద్వారా ఫిష్ వెంకట్ సినీ పరిశ్రమకు పరిచమయమైయ్యాడు. వి.వి. వినాయక్ ఫిష్ వెంకట్ ను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. ఫిష్ వెంకట్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.