3 May, 2026 | 5:55 PM

దైత అమ్మవారికి అభిషేకం

03-05-2026 04:54 PM

మంగపేట,(విజయక్రాంతి): రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి చెందిన ములుగు జిల్లా మంగపేట మండలంలోని శ్రీ హేమాచల(మల్లూరు) లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఆలయ సమీపంలోని  దైత అమ్మవారికి స్నపనం ( అభిషేకం ) కార్యక్రమం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజైన ఆదివారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అర్చకులు, శ్రీ హేమాచల ( మల్లూరు ) లక్ష్మీ నృసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల నిర్వాహక పూజారులు అమరవాది మురళీ కృష్ణమాచార్యులు, వారి బృందం, శ్రీ హేమాచల లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు ముక్కామల రాజశేఖర శర్మ, అర్చకులు కారంపూడి పవనకుమారాచార్యులు, యేడునూతల ఈశ్వర చందు శర్మ, ముక్కామల వేంకట నారాయణ శర్మ ( బాబీ ), అనిపెద్ది రాజీవాచార్యులు తదితరుల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం దైత అమ్మవారికి వారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం చతుస్థానార్చన, శ్రీ లక్ష్మీ నరసింహ సహస్రనామ పారాయణ హవనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.