3 May, 2026 | 6:30 PM

100 ఎకరాలలో మొక్కజొన్న జొన్న పంట దగ్ధం

03-05-2026 05:04 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని కనుగుట్ట గ్రామ శివారులో ఆదివారం మధ్యాహ్నం మొక్కజొన్న జొన్న పంటలకు అగ్ని ప్రమాదం జరగడంతో దాదాపు 100 ఎకరాల్లో పంట నష్టం జరిగింది విషయం తెలుసుకున్న రైతులు మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాగా మంటలను ఆర్పేందుకు ఇచ్చోడా అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడం జరిగిందని రైతులు తెలిపారు. సంఘటనలో పొలాల మధ్యన ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ సైతం ఖాళీ పోయిందని రైతులంటున్నారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది నష్టం లక్షల్లో ఉంటుందని అంటున్నారు.