ప్రతిసారీ అలా జరుగుతుంటే.. ప్రేమలో ఎలా పడతాను?!
ఓ హీరో కానీ, హీరోయిన్స్ కానీ ఎవరితోనైనా ఒంటరిగా కనిపిస్తే చాలు వాళ్లతో ప్రేమలో ఉన్నారనీ.. డేటింగ్ చేస్తున్నారనీ రూమర్స్ వచ్చేస్తుంటాయి. తరుచూ ఇదే జరుగుంటే మాత్రం ఇక కన్‌ఫర్మ్ అంటూ వైరల్ చేసేస్తుంటారు. ఇటీవల హీరోయిన్ శ్రీలీల విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఇటీవల ‘వైరల్ వయ్యారి’ పాటతో వైరల్ అయిన శ్రీలీల ప్రేమ విషయాలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి నటిస్తోంది. ఈ క్రమంలోనే శ్రీలీల కార్తీక్‌తో కొన్ని పార్టీలకు వెళ్లడం, అతని తల్లి నాకు డాక్టర్ కోడలుగా రావాలని చెప్పడం, కార్తీక్ ఆర్యన్ ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో శ్రీలీల పాల్గొనడం.. శ్రీలీల ప్రేమాయణం వార్తలకు కారణమయ్యాయి. శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ డేటింగ్‌లో ఉన్నారని.. పెళ్లి చేసుకుంటారని వార్తలొచ్చాయి. ఈ జంట లవ్ రూమర్స్ బాలీవుడ్‌లో బాగానే వైరల్ అయ్యాయి.
ఇప్పటివరకు వీటిని శ్రీలీల కానీ, కార్తిక్ ఆర్యన్ కానీ ఖండించలేదు. దీంతో అందరూ వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారేమోనని అనుకున్నారు. ఇదిలా ఉండగా శ్రీలీల తాజాగా ‘జూనియర్’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా శ్రీలీల తన ప్రేమ, పెళ్లి రూమర్స్ గురించి క్లారిటీ ఇచ్చింది. “నేను ప్రేమలో పడ్డానని అందరూ అంటున్నారు.
అసలు నేనెలా ప్రేమలో పడతాను.. ప్రతిసారి మా అమ్మ నాతోనే ఉంటోంది. నేను వెకేషన్‌కి వెళ్లినప్పుడు కూడా మా అమ్మ నా పక్కనే ఉంటోంది. అలాంటింది నేను ఎలా ప్రేమలో ఉంటాను. అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ప్రస్తుతం నా వయసు 23. కనీసం 30 ఏళ్లు వచ్చేవరకు పెళ్లి చేసుకోను” అని చెప్పింది. మొత్తానికైతే ప్రస్తుతం తాను ఎవరితోనూ ప్రేమలో లేదని, అదంతా తప్పుడు ప్రచారమేనంటూ రూమర్స్‌కు పుల్‌స్టాప్ పెట్టేసింది శ్రీలీల.






