20 March, 2026 | 9:43 AM

ఎట్టకేలకు ‘రైతుభరోసా’

19-03-2026 12:00 AM

భారత దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఒకప్పుడు ఒక మాట అటుండేవారు. ‘దేశంలో ఏ పనైనా ఆగవచ్చు.. కానీ, వ్యవసాయం మా త్రం ఆగకూడదు’ అని. మనిషి తన దైనందిన జీవితంలో ఆర్థిక కారణాల వల్ల కొన్ని పనులను వాయిదా వేసుకోవచ్చు. కానీ జీవనోపాధిగా వ్యవసాయం చేసే రైతులు అలా చేయడానికి వీలుండదు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగానే సాగు పనులు చేసుకోవాల్సి ఉంటుంది.

ము ఖ్యంగా తెలంగాణ లాంటి ప్రాంతాల్లో వ్య వసాయం ఎక్కువగా వర్షం మీదనే ఆధారపడి ఉంటుంది. ఏడాది పొడుగునా రైతు లు ప్రకృతిని నమ్ముకునే ప్రణాళికలు వేసుకుంటారు. వానాకాలం పంట కోసం జూన్ నెలలో వచ్చే నైరుతి పవనాల కోసం ఎదురుచూడటం మన రైతులకు అలవా టు. ఇక యాసంగిలో బోర్లు, కాల్వల నీటి మీద ఆధారపడి సాగు చేస్తారు.

ఈ క్రమం లో పెట్టుబడి సాయం కోసం ఎదురుచూసే పరిస్థితి రైతులకు ఉండేది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ.12 వే లు అందిస్తున్నారు. ఈ సాయం వల్ల అన్నదాతల పెట్టుబడి రంది పూర్తిగా తీరిపో యింది. కేవలం పంట పండించడమే కాకుండా, విత్తనాలు కొనుగోలు చేయడానికి, కూలీలకు చెల్లింపులు చేయడానికి ఈ నిధులు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయి.

ప్రస్తుతం తెలంగాణ రాజకీయం మొత్తం రైతుల చుట్టూనే తిరుగుతోంది. రైతు భరోసా పథకం ఈసారి రాజకీయ రంగు పులుముకుంది. ఈ పథకం అమలులో జరిగిన ఆలస్యంపై విపక్షాలన్నీ ప్ర భుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. రబీ సీజన్‌లో రైతు భరోసా రాదని గులాబీ దళం పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది. ప్రభుత్వంపై దాడి చేస్తూ రైతులను అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేసింది. అయితే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సాగు మడి కి నిధులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రతి రైతుకు మొదటి దఫాలో పెట్టుబడి సా యం అందేలా చర్యలు తీసుకుంటోంది.

దాదాపు 70 లక్షల మంది రైతుల ఖాతా ల్లో నేరుగా నగదు జమ చేసేందుకు ప్రభు త్వం సన్నద్ధమైంది. వ్యవసాయ విస్తరణ అధికారులు ఈ పనుల్లోనే నిమగ్నమై ఉన్నారు. ప్రభుత్వం చూపిస్తున్న ఈ హడావుడి చూస్తుంటే ఒకటి రెండు రోజుల్లోనే రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తుందని స్పష్టమవుతోంది. ఆ రోజు ఎంతో దూరం లో లేదని అర్ధమవుతోంది. విపక్షాలు చేస్తు న్న విమర్శలను తిప్పికొడుతూ రైతుల పక్షాన నిలబడటమే తమ ధ్యేయమని ప్రభుత్వం చాటి చెబుతోంది.

ఉగాది కానుకగా రూ.9 వేల కోట్లు

రైతులకు పంట సాయం రూపంలో ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఈ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు. ఏటా ఎకరానికి రూ.12 వేల చొప్పున సర్కారు అందిస్తోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం గత వానాకాలం సీజన్‌లో తొమ్మిది రోజుల వ్యవధిలోనే ఎకరాల వారీ నిధులు జమ చేసింది. అప్పట్లో అం దరితో శభాష్ అనిపించుకుంది. ఇప్పు డు యాసంగి పంటకు సంబంధించి 22వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో మూడు విడతలుగా నగదు జమ కానుంది. రాష్ట్రవ్యా ప్తంగా 1.50 కోట్ల ఎకరాలకు గానూ సు మారు 73 లక్షల మంది రైతులకు ఈ సాయం అందుతుంది.

దీనికోసం రేవంత్ సర్కార్ ఉగాది పండుగ సందర్భంగా దాదాపు రూ.9,000 కోట్లకు పైనే నిధులను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా తొలి దఫాలో రూ. 3,590 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసి నా వ్యవసాయ శాఖ ఈ నిధులను ఆదివారం నుంచే అకౌంట్లలో వేయనుంది. పెట్టుబడి సాయం అందుతుందనే వార్తతో రాష్ట్రవ్యాప్తంగా చిన్న, సన్నకారు రైతులు సంబురాలు చేసుకుంటున్నారు. ఉగాది పండుగ వేళ రైతుల ఇళ్లలో ఈ నిధులు కొత్త వెలుగులు నింపనున్నాయి.

సాగుదారులకే అసలైన ప్రయోజనం

రైతు రుణమాఫీ, పంట బీమా, రైతు బీమా వంటి పథకాలతో పాటు సన్నాలకు బోనస్ ఇస్తుండటంతో వ్యవసాయం పం డుగలా మారింది. పెట్టుబడి సాయం కూడా తోడవడంతో దిగుబడులు దండిగా వస్తున్నాయి. ఇది చూసి రైతాంగం మురిసిపోతోంది. అయితే ప్రతిపక్షాలకు అవ కాశం ఇవ్వకుండా రైతుల పక్షాన నిలిచేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకో వాలి. వాస్తవ సాగుదారులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా రైతు భరోసా పథకంలో మార్పులు చేయాలి.

రైతుల ఆదా యాన్ని రెండింతలు చేయడానికి వ్యవసాయ మౌలిక వసతుల కల్పన కోసం అదనపు బడ్జెట్ కేటాయింపులు చాలా అవసరం. కనీస మద్దతు ధర పెంపు విషయంలో కేంద్రం తగినంత కేటాయింపులు చేయలేదని వ్యవసాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఉత్పాదక వ్యయానికి ఒక టిన్నర రెట్లు ఎక్కువగా మద్దతు ధర ఉం డాలని అవి కోరుతున్నాయి. రాష్ట్ర ప్రభు త్వం ఈ దిశగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రైతులు ఆశిస్తున్నారు. మార్కెట్ యార్డుల్లో రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం వల్ల వారు దళారీల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

గత పాలకుల వైఖరి ప్రస్తుత మార్పు

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో చి క్కుకుంది. సమైక్య పాలకుల పక్షపాత వైఖ రి వల్ల తెలంగాణ రైతాంగం ఆగమైపోయింది. నీళ్లు లేక, నిధులు అందక, కరెం టు రాక రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డా రు. పంట నష్టాలు తట్టుకోలేక రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగింది. తెలంగాణ సిద్ధించిన తర్వాత నాటి ప్రభుత్వం ‘రైతుబంధు’ పథకాన్ని తెచ్చింది. అయితే ఆ పథకం వల్ల గుట్టలకు, చెట్లకు, రోడ్లకు కూడా పెట్టుబడి సాయం అందిందనే విమర్శ ఉంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానా అనవసరంగా ఖాళీ అయ్యింది.

పడావు పడ్డ భూములకు, సంపన్నులకు ఈ నిధు లు దక్కాయి. బ్యాంకుల నుంచి వచ్చే రు ణాలు కూడా ఇలాంటి వారికే అందుతున్నాయి. అందుకే అసలైన సాగుదారులకు మాత్రమే రుణాలు అందేలా చూడాలి. అప్పుడే రైతు నిజమైన రాజు అవుతాడు. ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకంతో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతోంది.

కాళేశ్వరం ఎత్తిపోతల నుంచి చుక్క నీరు ఎత్తిపోయకపోయి నా తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగలా చేశారు. వానాకాలం, యాసంగి సీజ న్లలో సాయం అందుతుండటంతో రైతు లు వరితో పాటు మ్కొజొన్న, వేరుశనగ, పప్పు ధాన్యాలు సాగు చేస్తున్నారు. 25 లక్షల రైతు కుటుంబాలకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే.

విపక్షాల ఆరోపణలు 

రైతు భరోసా నిధులు రావని, రేవంత్ ప్రభుత్వం ఈ పథకాన్ని ఆపేస్తుందని విపక్షాలు గ్రామాల్లో గగ్గోలు పెట్టాయి. పంచా యతీ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కో సం కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశా యి. కానీ రైతన్నలు ఆ మాటలను ఏమా త్రం పట్టించుకోలేదు. పంచాయతీల్లో 70 శాతం మంది అధికార పార్టీకే పట్టం కట్టా రు. అంటే విపక్షాల ఆరోపణలను ప్రజలు తిరస్కరించినట్లే భావించాలి.

మున్సిపల్ ఎన్నికల్లో కూడా విపక్షాలు ఇదే అస్త్రాన్ని వా డి బొక్కబోర్లా పడ్డాయి. నాట్లు వేసే సమయంలో ఇవ్వాల్సిన సాయాన్ని కోతల కాలం వరకు ఇవ్వలేదని రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలోనే ఈ నెల 22 నుంచి నిధులు విడుదల చే యాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారుల ను ఆదేశించారు. దీంతో విపక్షాల నోట్లో ఏలక్కాయ పడ్డట్లుంది. ఖంగుతిన్న గులాబీ దళం ఇప్పుడు మరో వాదనను తెరపైకి తెచ్చింది.

నిధులను ఒకేసారి ఇవ్వకుండా మూడు వాయిదాల్లో ఇవ్వడం ఏం టని ప్రశ్నిస్తోంది. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఖజానా ఖాళీ అయినా రేవం త్ ప్రభుత్వం రైతుల కోసం ముందుకు సాగుతోంది. ఎన్నికలు లేని సమయంలో కూడా నిధులు విడుదల చేస్తున్నారంటేటైది రైతుల మీద ఉన్న ప్రేమ మాత్రమే. పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్లే నిధుల విడుదలలో కొంత ఆలస్యం జరిగిందనేది నగ్న సత్యం.

 సెల్: 9866255355