20 June, 2026 | 10:53 PM

క్యాన్సర్ బాధితురాలికి రూ.5000 ఆర్థిక సాయం

20-06-2026 09:43 PM

- టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎడపల్లి బాబు

బోయినపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రానికి చెందిన  టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎడపల్లి బాబు ఇదే మండలంలోని బూరుపల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి లత అనే క్యాన్సర్ బాధితురాలకి రూ.ఐదువేల నగదు ఆర్థిక సాయం అందించారు. బూరుగుపల్లి గ్రామానికి చెందిన లత కొద్ది నెలలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది.

వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో దాతలు ఇచ్చిన సాయంతో వైద్యం చేయించుకుంటుంది. ఈ నేపథ్యంలో సామాజిక కార్యకర్త టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పేదలకు అనునిత్యం అండగా ఉండే ఎడపల్లి బాబు బాధితురాలికి బాసటగా నిలిచి రూ. ఐదువేల సాయం అందించి భవిష్యత్తులో మరింత సాయం అందించేందుకు కృషి చేస్తున్నట్లు బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు.