20 June, 2026 | 10:42 PM

యోగాతో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం

20-06-2026 09:31 PM

గ్లోబల్ రెయిన్ బో స్కూల్, జేవీఆర్ కళాశాల కరస్పాడెంట్ మహ్మద్ ఎర్షాద్ అహ్మద్

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం 

ఉత్సాహంగా ఆసనాలు వేసిన విద్యార్థులు 

కూసుమంచి,(విజయక్రాంతి): కూసుమంచి మండల కేంద్రంలోని గ్లోబల్ రెయిన్ బో స్కూల్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నిపురస్కరించుకొని ముందస్తుగా శనివారం యోగా డే నిర్వహించారు.  విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా గ్లోబల్ రెయిన్ బో స్కూల్, జేవీఆర్ కళాశాల కరస్పాడెంట్ మహ్మద్ ఎర్షాద్ అహ్మద్ మాట్లాడుతూ... ఆరోగ్య సంరక్షణలో యోగా ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ యోగా సాధన చేయాలని సూచించారు. సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలంటే ప్రతిరోజూ యోగా సాధాన చేయాలన్నారు. 

యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జీవన విధానమని తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజూ యోగా చేయాలని, దానిని తమ దినచర్యలో భాగంగా చేసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో వివిధ యోగాసనాలు చేయించి వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. యోగా చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటంతో పాటు మనసు ప్రశాంతంగా ఉంటుందని, ఏకాగ్రత పెరిగి చదువుపై మరింత దృష్టి సారించగలరని తెలిపారు. యోగా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ జార్జులు జహ్నవి,పాపారావు, నాజియా ఆఫ్రిన్ తదితరులు పాల్గొన్నారు.