24 August, 2026 | 10:15 PM

Breaking News

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •  

రుద్రంగి మృతుల కుటుంబాలకు ఆది కార్తీక్ ఆర్థిక సాయం

24-08-2026 04:21 PM

 రుద్రంగి ఆగష్టు 24(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి లింగంపేట సరిహద్దులా మధ్య జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రుద్రంగికి చెందిన నలుగురు రక్తసంబంధీకులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఊహించని దుర్ఘటనతో శోకసంద్రంలో మునిగిపోయిన బాధిత కుటుంబాలకు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తనయుడు కార్తీక్ రూ. 50,000/ల ఆర్థిక సహాయాన్ని అందించి బాధిత కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలిచారు.

ఈ ఆర్థిక సహాయాన్ని వేములవాడ ఏరియా ఆసుపత్రి వద్ద స్థానిక రుద్రంగి సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతిల చేతుల మీదుగా అందజేశారు. ఒకే కుటుంబంలో నలుగురు సొంత మనుషులను కోల్పోయిన కష్టకాలంలో అండగా నిలిచి తక్షణ సహాయం అందించిన ఆది కార్తీక్‌ సేవా దృక్పథాన్ని నాయకులు కొనియాడారు.​ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తర్రే మనోహర్, పల్లి గంగాధర్, కొమిరే శంకర్ తదితరులు పాల్గొన్నారు.