24 August, 2026 | 10:54 PM

ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి

24-08-2026 09:42 PM

తనిఖీలో గమనించిన పలు ఉల్లంఘనలు

కాంట్రాక్టర్ కు నోటీసులు జారీ

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని డైట్ క్యాంటీన్‌ను తనిఖీ ఆకస్మికంగా చేశారు. ఈ సందర్భంగా ఆహార భద్రతా అధికారి మాట్లాడుతూ తనిఖీలో పలు విషయాలను గమనించినట్లు తెలిపారు. అందులో భాగముగా ముడి పదార్థాల కోసం సరైన ఆహార నిల్వ సౌకర్యం లేదని, ఆహార పదార్థాలను నిర్వహించేవారు టోపీలు, చేతి తొడుగులు ధరించలేదని అన్నారు. అంతేకాకుండా ఆహార పదార్థాలను నిర్వహించేవారికి వైద్య ధృవపత్రాలు లేవని పేర్కొన్నారు. ఈ మేరకు కాంట్రాక్టర్‌కు నోటీసు జారీ చేసి, నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించడం జరిగిందని ఈ సందర్భంగా ఆహార భద్రతా అధికారి వరుణ్ రెడ్డి తెలిపారు.