గీత కార్మికుని వైద్యానికి కానా ఆర్థిక సహాయం
రూ.10,000 అందజేసిన స్థానిక ప్రతినిధులు
నల్లగొండ టౌన్, జూలై 9 : కనగల్లు మండలం కేంద్రానికి చెందిన గీత కార్మికుడు పాలకూర శంకరయ్య గాయాలతో చికిత్స పొందుతున్న నేపథ్యంలో వైద్య ఖర్చుల కోసం కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (కానా) ప్రతినిధులు గురువారం నల్లగొండలో రూ.10,వేలు ఆర్థిక సహాయం అందజేశారు.కల్లు గీత కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొండా వెంకన్న గౌడ్, కానా స్థానిక ప్రతినిధి బల్గూరి వెంకన్న గౌడ్ ల సమాచారం మేరకు కానా సభ్యులు స్పందించారు.
స్థానిక ప్రతినిధులు నాతి గణేష్, బాల్నే రామచంద్రుడు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కల్లు గీత కార్మికుల సంఘం నాయకులు కానా చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కానా స్థానిక ప్రతినిధి బల్గూరి వెంకన్న గౌడ్, జిల్లా అధ్యక్షుడు కొండా వెంకన్న గౌడ్, ఎంవీన్ విజ్ఞాన కేంద్రం చైర్మన్ పుచ్చకాయల నర్సిరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు నర్సింగ్ సైదులు, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, పట్టణ కార్యదర్శి గుండాల నరేష్, గౌడ సంఘం నాయకులు బొల్లు రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.






