సాంకేతిక సేవలను వినియోగించుకోవాలి
న్యాయం కోసం వచ్చే వారికి భరోసా కల్పించాలి
సీపీ అంబర్ కిషోర్ ఝా
మంచిర్యాల, జూలై 9 (విజయక్రాంతి): కేసుల పరిష్కారంలో సాంకేతిక సేవలను వినియోగించుకోవాలని, న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చే వారికి మేమున్నామనే భరోసా కల్పించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం మంచిర్యాల జిల్లాలోని మాదారం పోలీస్ స్టేషన్ను మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ తో కలిసి పరిసరాలను, వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, ఆవరణలోని క్రీడా ప్రాంగణం, పోలీస్ వాహనాల నిర్వహణను పరిశీలించారు.
స్టేషన్కు సంబంధించిన రికార్డులు, రౌడీషీటర్లు, అనుమానితుల వివరాలను తెలుసుకున్నారు. సిబ్బందితో మాట్లాడి వారి విధు లు, ఎదురవుతున్న సమస్యల గురించి ఆరా తీశారు. పోలీస్ స్టేషన్లోని కమ్యూనికేషన్ వ్యవస్థ పనితీరును పరిశీలించి పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం అందినప్పుడు కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తత, స్పందన తీరు ఎలా ఉందో కమ్యూనికేషన్ సెట్ ద్వారా మాట్లాడి తెలుసుకున్నారు.
పోలీస్ స్టేషన్ సంబందించిన పూర్తి రికారడ్స్,పెండింగ్ కేసులు, తదితర వివరాలను సీఐ, ఎస్‌ఐలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రతి పోలీస్ వాహనంలో ఫస్ట్ ఎయిడ్ కిట్, డ్రాగన్ లైట్, తా ళ్లు, ట్రాఫిక్ కోన్స్, క్రైమ్ ప్రొటెక్షన్ రిబ్బన్, రై ట్ గేర్ కిట్ (హెల్మెట్, స్టోన్ గార్డ్, లాఠీ, బాడీ ప్రొటెక్టర్) తప్పనిసరిగా ఉండాలని సూచించారు.
గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు సేవలందిస్తున్న మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు మరింత స్నేహపూర్వకంగా, అందుబాటులో ఉండే పోలీసింగ్ అందించాలని, గిరిజనులతో సున్నితంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను అర్థం చేసుకుని విశ్వాసాన్ని పెంపొందించాలని ఎస్‌ఐ, సీఐలకు ఆదేశించారు. పోలీస్ శాఖలో అందు బాటులో ఉన్న ఆధునిక సాంకేతిక సేవలు, సీసీటీఎన్‌ఎస్, హాక్ ఐ, టీఎస్ కాప్ వంటి యాప్లను సమర్థవంతంగా వినియోగించాలని, పాస్పో ర్ట్ ధృవీకరణ,
వివిధ ధ్రువపత్రాల జారీ, ఫిర్యాదుల స్వీకరణ వంటి ఆన్లైన్ సేవలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, యువతకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. వీరి వెంట బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవయ్య, ఎస్‌ఐ సౌజన్య, సిబ్బంది తదితరులున్నారు.






