పేదల చదువుకు ఆర్థిక సమస్య అడ్డంకి కాకూడదు
సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థుల విద్యకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంద ని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్(Minister Adluri Laxman Kumar) తెలిపారు. ప్రీమెట్రిక్, పోస్ట్‌మెట్రిక్, ఓ వర్సీస్ స్కాలర్‌షిప్‌కు సంబంధించి 2014 15 నుంచి 2025 వరకు ఉన్న డిమాండ్, మంజూరు, చెల్లింపులు, పెండింగ్ వివరాలను శాసనసభలో మంత్రి అధికారికంగా వెల్లడించారు.
అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 2025 విద్యా సంవత్సరానికి ఎస్సీ అభివృద్ధి శాఖలో రూ.605.26 కోట్ల డిమాండ్‌కు రూ.57.58 కోట్లు చెల్లించగా, రూ. 547.68 కోట్లు బకాయిగా ఉన్నట్లు తెలిపా రు. ఎస్టీ సంక్షేమ శాఖలో రూ.278.70 కోట్ల డిమాండ్‌కు రూ.82.90 కోట్లు చెల్లించగా, రూ.195.79 కోట్లు బకాయి ఉన్నట్లు పేర్కొన్నారు.
బీసీ సంక్షేమ శాఖలో రూ.922.92 కోట్ల డిమాండ్‌కు రూ.31.06 కోట్లు చెల్లించగా, రూ.891.85 కోట్లు చెల్లించాల్సి ఉంద ని వివరించారు. ఈబీసీ విభాగంలో రూ. 134.71 కోట్ల డిమాండ్‌కు రూ.2.27 కోట్లు చెల్లించగా, రూ.132.44 కోట్లు బకాయిగా ఉన్నాయని తెలిపారు. మైనార్టీ సంక్షేమ శాఖలో రూ.251.86 కోట్ల డిమాండ్ ఉండ గా, ఇప్పటివరకు చెల్లింపు జరగకపోవడంతో మొత్తం రూ.251.86 కోట్లు బకాయిగా న మోదైనట్లు మంత్రి వెల్లడించారు.
2014 15 నుంచి 2025 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు సంబంధించి 10,008 దరఖాస్తుల ధృవీకరణ జరిగిందని తెలిపారు. వీటి మొత్తం డిమాండ్ రూ. 1,909.62 కోట్లు కాగా, 9,986 దరఖాస్తులకు రూ. 1,851.28 కోట్లకు ఆమోదం తెలిపినట్టు వివరించారు.
ఇప్పటివరకు 9,124 దరఖాస్తుల కు రూ.1,654.82 కోట్లు చెల్లించగా, మంజూరైనప్పటికీ చెల్లించాల్సి ఉన్న 862 దరఖా స్తులకు సంబంధించి రూ.196.45 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. 2025 26లో ఎస్సీ విభాగానికి సంబంధించి 150 దరఖాస్తులకు రూ.30.68 కోట్ల డిమాండ్ ఉండగా, రూ.22.32 కోట్లు ఆమోదమైనప్పటికీ చెల్లింపు జరగలేదని గణాంకాల్లో పేర్కొ న్నట్టు తెలిపారు.
విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యం
విద్యార్థుల సంక్షేమానికి అవసరమైన నిధుల విడుదలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇ స్తోందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా క్రమంలో నిధులు సమకూరుస్తూ, పెండింగ్ చెల్లింపులను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలు పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉ న్నత విద్యను కొనసాగించేందుకు కీలకమైన ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని మంత్రి లక్ష్మణ్‌కుమార్ పేర్కొన్నారు.