2 May, 2026 | 1:08 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

హత్యకు దారి తీసిన ఆర్థిక లావాదేవీలు

09-03-2026 12:30 AM

అప్పు విషయంలో స్నేహితుల మధ్య వివాదం 

ఎల్బీనగర్, మార్చి 8: అప్పు తీర్చే విషయంలో తలెత్తిన వివాదం వ్యక్తి హత్యకు దారి తీసిన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... ఖమ్మం జిల్లా గార్ల మండలానికి చెందిన యాదయ్య, సతీశ్ ఇద్దరు స్నేహితులు. వీరిద్దరూ బోరబండ పరిధిలోని మోతీనగర్ లో ఉంటున్నారు. ఉపాధి కోసం వేర్వేరు ప్రాంతాల్లో హోటళ్ళలో పని చేస్తున్నారు. ఇద్దరి మధ్యన డబ్బుల లావాదేవీలు ఉన్నాయి.

ఈ క్రమంలో శనివారం సాయంత్రం సుమారు 7:30 గంటల ప్రాంతంలో సతీష్ తన హోటల్లో పనిచేసే ఇద్దరు వ్యక్తులతో కలిసి చైతన్యపురి పోలీస్ స్టేషన్ సమీపానికి వచ్చాడు. అక్కడ యాదయ్యను డబ్బుల విషయమై ప్రశ్నించగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సతీష్ తనతో వచ్చిన వ్యక్తులతో కలిసి యాదయ్య(30)పై దాడి చేశారు.

ఈ దాడిలో యాదయ్య స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆటోలో సమీపంలోని జీబీఆర్ హాస్పిటల్కు తరలించగా, యాదయ్య అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు యాదయ్య తండ్రి యెడ్ల కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.