ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బట్టలు పంపిణీ
మాజీ జడ్పిటిసి తీగల తిరుమల గౌడ్
దోమకొండ, మార్చి 8 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండలో ఇందిరమ్మ ఇల్లు మంజూరై నిర్మాణం పూర్తయిన లబ్ధిదారుల గృహప్రవేశం కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఆదివారం దోమకొండకు చెందిన జాల జమున- రాజేందర్ ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశం సందర్భంగా, మాజీ జెడ్పిటిసి తిరుమల్ గౌడ్ లబ్ధిదారుకు బట్టలను అందజేశారు. ఈ సందర్భంగా తిరుమల్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ పాలనలోనే నిరుపేదలకు ఇల్లు నిర్మాణాలు మంజూరయ్యాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, జిల్లా కార్యదర్శి అబ్రబోయిన స్వామి, పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు, ఏఎంసీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, నాయకులు శంకర్ రెడ్డి, నర్సారెడ్డి, నల్లపు శ్రీనివాసు, మర్రి శేఖర్, బట్టి రాములు, బాలరాజు, శమ్మీ, నయీమ్, రమేష్, నరేష్ రెడ్డి, అబ్రబోయిన రాజు తదితరులు పాల్గొన్నారు.




