సన్నబియ్యంతోపాటు నిత్యావసరాలు
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): పేద ప్రజలకు అందిస్తున్న సన్న బియ్యం(grain rice)తో పాటు ఇతర నిత్యావసర సరకుల పంపిణీ(Distribution of essential commodities) ప్రభుత్వ ఆలోచనలో ఉందని, బడ్జెట్ కారణంగా కాస్తా ఆలస్యం జరుగుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Uttam Kumar Reddy) పేర్కొన్నారు. శాసనమండలి(Legislative Council)లో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుడు ప్రొఫెసర్ కోదండరామ్(Professor Kodandaram), టీ భానుప్రసాద్, బీ మహేష్‌గౌడ్, దాసోజు శ్రవణ్(Dasoju Sravan) అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రస్తుతం రాష్ర్టంలో 1 కోటి 6 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయని, తద్వారా 3 కోట్ల 42 లక్షల మంది పౌరులకి సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు.
నిత్యావసర సరకుల పంపిణీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మంత్రి సమాధానంపై కొదండరాం స్పందిస్తూ ప్రభ్తుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం వలన ఆహార భద్రత ఏర్పడింది కానీ, ప్రజలకు పౌష్టికాహారం అందడం లేదన్నారు. .దీనిపై ప్రభుత్వం దష్టి సారించాలని సూచించారు. అలాగే భానుప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులు కాని వారికి కూడా రేషన్‌కార్డులు జారీ చేశారన్నారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందన్నారు.
దరఖాస్తు చేస్తే చాలూ రేషన్‌కార్డు: మండలి చైర్మన్ గుత్తా
మీసేవా ద్వారా దరఖాస్తు చేస్తే చాలు రేషన్ కార్డులను జారీ చేశారని, అలా ఎవ్వరూ చేసుకున్నా జారీ చేస్తే ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందని పేర్కొన్నారు. దీన్ని పునరాలోచన చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి ఆయన సూచించారు.
2027 నాటికి నెల్లికల్లు ఎత్తిపోతల పూర్తి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నెల్లికల్లు ఎత్తిపోతల పథకం డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనమండలిలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు కోటిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. నెల్లికల్లు ఎత్తిపోతల పథకం ఫేజ్1 పనులు 2027 జూన్ నాటికి, ఫేజ్2 పనులు 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి, సుమారు 24 వేల ఎకరాలకు నీరు అందిస్తామని తెలిపారు. కోటిరెడ్డి స్పందిస్తూ గత 50 ఏళ్లుగా అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ నెల్లికల్లు ఎత్తిపోతల పథకం ముందుకు సాగడంలేదన్నారు. అధికారంలో ఉన్న క్రాంగ్రె స్ ప్రభుత్వం అయిన ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని విజ్ఞప్తి చేశారు.