యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం
17-05-2026 04:39 PM
నల్లగొండ: జిల్లాలోని దామరచర్ల మండలం, వీర్లపాటెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాంట్‌లోని యూనిట్-3 పరిధిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పరిసరాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ ఏరియాలో టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ వద్ద ఆయిల్ లీకేజీ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో కంట్రోల్ కేబుల్స్, వాల్వ్‌లు దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రధాన యంత్రాలకు ముప్పు తప్పినట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






