17 August, 2026 | 9:39 AM

ఎంఎం పహాడీలో అగ్ని ప్రమాదం

11-11-2024 03:29 PM

రాజేంద్రనగర్ (విజయక్రాంతి): అత్తాపూర్ ఎంఎం పహాడిలో అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా స్క్రాప్ గోదాంలో మంటలు చెలరేగాయి. మంటలను గమనించి స్థానికులు పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది  2 ఫైర్ ఇంజన్ ల సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మంటలు అదుపులోకి రావడం లేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని సమాచారం. ఎవరికి ఏమి జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.