25 June, 2026 | 4:13 PM

సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం

25-06-2026 03:30 PM

హైదరాబాద్: సికింద్రాబాద్(Secunderabad) పరిధిలోని సూర్య కిరణ్ బిల్డింగ్ లో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్వప్నలోక్(Swapnalok Complex) కాంప్లెక్స్ పక్కనున్న సూర్యకిరణ భవనంలోని మొదటి అంతస్తులో మంటలు అంటుకున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని ఫైర్ సిబ్బంది పేర్కొన్నారు. మంటలను గమనించిన స్థానికులు, అక్కడి షాపుల్లోని సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.