21 May, 2026 | 11:42 AM

చార్మినార్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం

21-05-2026 11:12 AM

మదీనా చౌరస్తాలో బారీ అగ్నిప్రమాదం 

హైదరాబాద్: చార్మినార్(Charminar) సమీపంలో మదీనా చౌరస్తాలో గురువారం భారీ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. మదీనా చౌరస్తాలోని(Medina Junction) SYJ కాంప్లెక్స్‌లోని వస్త్రదుకాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన వెంటనే, మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పే చర్యలు చేపట్టేందుకు ఎనిమిది ఫైర్ టెండర్లను ఆ ప్రదేశానికి తరలించారు. రెండు గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కాంప్లెక్స్‌లో ఉన్నవారు ప్రాణభయంతో పరుగులు పెట్టారు.