2 May, 2026 | 9:24 PM

Breaking News

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •  

ఆగి ఉన్న గూడ్స్ రైలులో అగ్ని ప్రమాదం

11-08-2024 10:32 AM

జగిత్యాల లింగం పేట రైల్వే స్టేషన్

స్టేషన్ మాష్టర్ సమయ స్ఫూర్తితో తప్పిన పెనుముప్పు

జగిత్యాల, (విజయ క్రాంతి): జగిత్యాలలోని లింగంపేట రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న గూడ్స్ రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే శనివారం సాయంత్రం దాదాపు 6 గంటల సమయంలో జగిత్యాలలోని లింగంపేట రైల్వేస్టేషన్ లో ఉన్న గూడ్స్ రైలులో  బొగ్గు వ్యాగన్ లో మంటలు ఒక్కసారిగా ఎగిసి పడటం గమనించి స్టేషన్ మాస్టర్  అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు మరింత ఎగసి పడకుండా అదుపులోకి తెచ్చారు. అయినప్పటికీ దాదాపు రూ. 5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు జగిత్యాల అగ్నిమాపక అధికారి ఏ. కృష్ణ కాంత్ తెలిపారు. ఎల్ఎఫ్ కే రవీందర్, ఆపరేటర్ ఏ. మల్లేశం, ఫైర్ మెన్ లు కే. నరేష్ , ఎం. కార్తీక్, జి. అరుణ్, జి. శ్రీనివాస్ అనే అగ్ని మాపక సిబ్బంది తదితరులు పాల్గొని మంటలు అదుపులోకి తీసుకుని వచ్చారు. కాగా స్టేషన్ మాష్టర్ సమయ స్ఫూర్తితోనే పెను ముప్పు తప్పినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది తెలిపారు.