ఫైర్ సేఫ్టీ అందరి బాధ్యత
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
సికింద్రాబాద్ ఫిబ్రవరి 4 (విజయ క్రాంతి): రానున్నది వేసవి కాలం. నిప్పు రగిలితే మంటలు వ్యాపించి భారీ మొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తుంది. ఇలాంటి తరుణంలో ప్రతి ఒక్కరూ ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పటికే హైడ్రా తనిఖీలు చేసి కొన్ని షాపులను సీజ్ చేయడమైంది. నెల రోజులు వ్యవధి కావాలని షాపుల యజమానులు, వ్యాపార సంఘాలకు చెందిన ప్రతినిధులు విజ్ఞప్తి చేయగా వారికి అనుకూలంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫిబ్రవరి నెలవరకూ సమయం ఇచ్చారు.
ఇదే సమయంలో అగ్ని ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలను హైడ్రా చేపట్టింది. నగర వ్యాప్తంగా మాక్ డ్రిల్స్, అవగాహన కార్యక్రమాలను సంబంధిత శాఖలతో కలిసి హైడ్రా పెద్దయెత్తున నిర్వహిస్తోంది. ఎవరికి వారు ఆలో చించి అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుం డా జాగ్రత్తలు తీసుకునేందుకు అనుసరించాల్సిన ప్రాథమిక అంశాలను తప్పకుండా పాటించాలని నగర ప్రజలకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ విజ్ఞప్తి చేశారు.






