calender_icon.png 5 February, 2026 | 10:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేర్వేరు చోట్ల గంజాయి పట్టివేత

05-02-2026 12:47:39 AM

  1. చందానగర్లో భారీగా గంజాయి పట్టివేత
  2. ఇద్దరు అరెస్ట్ 39 కేజీల గంజాయి స్వాధీనం

శేరిలింగంపల్లి/సికింద్రాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): ఒడిషా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల ను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 39 కేజీల గంజాయిని చందానగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మహారాష్ట్ర కొల్లాపూర్‌కు చెందిన శివ, రాహుల్ శరత్ సొంతూరులో సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకం చేస్తున్నారు.

ఈజీ మనీ కోసం గంజాయి అమ్మాలని ప్లాన్ వేసుకుని, ఈ క్రమంలో భువనేశ్వర్ వెళ్లి 39 కేజీల గంజా యి కొనుగోలు చేశారు. హైదరాబాద్లో అమ్మేందుకు భువనేశ్వర్ నుంచి హైదరాబాద్కి ట్రైన్‌లో బయలుదేరారు. సమాచా రం అందుకున్న శేరిలింగంపల్లి ఎస్‌ఓటి పోలీసులు లింగంపల్లి రైల్వే స్టేషనులో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానస్పద స్థితి లో కనిపించిన శివ, రాహుల్ లను అదుపులోకి తీసుకుని వారి నుంచి 39 కేజీల గంజా యి స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గం జాయి విలువ రూ.19.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

బాలనగర్‌లో గంజాయి పట్టివేత

సికింద్రాబాద్ : బాలనగర్‌లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్టు సమాచారంతో ఇద్దరు గంజాయి స్మగ్లర్ ని రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ బీ టీమ్ సీఐ సుబాష్ చందర్, ఏస్సై అఖిల్ సిబ్బంది కలిసి పట్టుకున్నారు.ఈ సందర్భంగా నిందితుల వద్ద నుంచి 520 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఈ కేసులో నిందితులు మహ్మమద్ ఇఫ్రాన్, మేకల అనిల్ కుమార్‌ను అరెస్టు చేసి, గంజాయిని, బైక్ను బాలనగర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించి నట్లు సీఐ తెలియజేశారు.