17 May, 2026 | 2:38 AM

ఐదు తులాల పుస్తెలతాడు చోరీ

17-05-2026 01:00 AM

మేడిపల్లి, మే 16 (విజయక్రాంతి): మహిళ మెడలో ఐదు తులాల బంగారు పుస్తెలతాడు లాక్కెళ్ళిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినాయకనగర్ కాల నీ రోడ్ నంబర్- 1లో నివాసం ఉంటున్న రిటై ర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కావడి మాణిక్యప్ప సతీమణి కావడి అనిత (56) ఇంటి ముందు రోడ్డుపై వాకింగ్ చేస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలోని పుస్తెలతాడును బలవంతంగా లాక్కొని బైక్‌పై పరారయ్యారు. బాధితురాలి మెడలో ఉన్న పుస్తెలతాడు ఐదు తులాలుంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.