07-02-2026 12:50:05 AM
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 6 (విజయ క్రాంతి):మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సిరిసిల్ల పట్టణ కేంద్రంలో జిల్లా పోలీస్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈసంద ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడానికి ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు.
ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాల ప్రకారం స్వేచ్చాయుతగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.ప్రతి ఒక్కరు ఎన్నికల ప్రవర్తన నియమావళి తప్పక పాటించాలని,ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
సిరిసిల్ల,వేములవాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పటిష్ట పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయడం జరుగుతుందని,ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన,గొడవలు సృష్టించాలని చూసిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని,
ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే విధంగా అక్రమ మద్యం, డబ్బు, ఇతర వస్తువులు రవాణా చేస్తే పోలీస్ వారికి సమాచారం అందించాలన్నారు.ఫ్లాగ్ మార్చ్ లో సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి, ఇన్స్పెక్టర్ లు కృష్ణ, శ్రీనివాస్, ఆర్.ఐ సురేష్,ఎస్.ఐ లు శ్రీకాంత్,ఉపేంద్రచారి,రాజు,దిలీప్, రాహుల్ రెడ్డి, లక్ష్మణ్, వీనితా రెడ్డి, జునైద్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.