07-02-2026 12:49:37 AM
- ఇప్పటికే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తుదిదశకు
- బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి లక్ష్మీ ప్రియ రామాంజనేయులు
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మూడవ వార్డును ఐదేళ్లలో కోట్ల రూపాయలతో నెంబర్ వన్ చేస్తానని మరొసారి అవకాశం ఇవ్వాలని 3వ డివిజన్ కార్పొరేషన్ లోనే నెంబర్ వన్ గా చేస్తానని 3వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి లక్ష్మిప్రియ రామాంజనేయులు అన్నారు. గత రెండు రోజుల కిందట బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా రావడంతో పట్టణంలో బిజెపిలో మరింత జోష్ పెరిగినట్లు తెలిపారు. ఎంత పెద్ద వర్షాలు కురిసిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ డ్రైనేజీలను నిర్మించి నేరుగా నాలకు అనుసంధానం చేస్తామని స్పష్టం చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతిక్షణం అందుబాటులో ఉండి సేవ చేస్తానని స్పష్టం చేశారు.
డివిజన్ లో తనకు వేసే ప్రతి ఓటు దేశానికి వేసినట్లేనని ప్రధానమంత్రి మోడీకి వేసినట్లేనని కాబట్టి దేశ ప్రగతి మన వార్డు నుంచే ప్రారంభం అవుతుందని దేశం కోసం ధర్మం కోసం తన వాడు అభివృద్ధి కోసం గెలిపించాలని కోరారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో 30కి పైగా బీజేపీ సీట్లు మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవడానికి తమంత సిద్ధంగా ఉన్నామని అందుకు తనకు సంపూర్ణ మద్దతు తెలియజేసి మనమందరం విజయతీరాలకు చేరుకుందామని సూచించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున బిజెపి కార్యకర్తలు ఓటర్లు తదితరులు ఉన్నారు.