9 May, 2026 | 10:39 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

విమాన ప్రయాణం@ 90 సెకన్లు

14-10-2024 03:39 AM

స్కాట్లాండ్‌లోని రెండు దీవుల మధ్య సర్వీసులు

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: సాధారణంగా విమాన సర్వీసులు ఉపయోగించేవారు ఒక దేశం నుంచి మరో దేశానికి లేక ఒక రాష్ట్రం నుంచి మారో రాష్ట్రానికి ప్రయాణిస్తుంటారు. అయితే కేవలం ౩ కిలోమీటర్ల కంటే తక్కువ దూరానికీ విమాన సర్వీసులు ఉపయోగించేవారు ఉన్నారు. స్కాట్లాండ్‌లోని లోగాన్ ఎయిర్ కంపెనీ ఓర్క్‌నీ దీవుల్లో వెస్ట్ రే, పాపా వెస్ట్ రే ప్రాంతాలను కలుపుతూ విమానాలను నడుపుతోది.

ఈ ౨ దీవుల మధ్య వంతెన లేకపోవడంతో 1.7 మైళ్ల దూరానికి సర్వీసులు అందిస్తున్నారు. టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకు 90 సెకన్లు సమయం పడుతుంది. ఈ విమానాల్లో  10 మంది ప్యాసింజర్లు ప్రయా ణం చేయవచ్చు. ఇక్కడ జనాభా కూడా తక్కువే. ఈ షార్ట్ జర్నీ వైరల్ అవడంతో కొన్నేళ్లుగా పర్యాటకులు ఆ అనుభూతిని పొందేందుకు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.