9 May, 2026 | 11:24 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

కమలా సంపూర్ణ ఆరోగ్యవంతురాలు

14-10-2024 03:40 AM

అధ్యక్ష పదవికి ఫిట్.. ఆమె వైద్యుడి ప్రకటన

వాషింగ్టన్, అక్టోబర్ 13: అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ సంపూర్ణ ఆరోగ్యవంతురాలని, అధ్యక్షురాలిగా విధులు నిర్వర్తించేందుకు ఫిట్ గా ఉన్నారని ఆమె వైద్యుడు జాషువా సిమ న్స్ తాజాగా రెండు పేజీల నోట్‌ను విడుదల చేశారు.

యూఎస్ ఆర్మీ కల్నల్, డాక్టర్ సిమన్ మూడున్నరేళ్లుగా హారిస్‌కు వ్యక్తిగత వైద్యుడిగా కొనసాగుతున్నారు. 59 ఏళ్ల కమలా చురుకైన జీవన శైలిని కలిగి ఉన్నారని ఆయన ప్రకటించారు. హారిస్ కొంత కాలం క్రితం అలర్జీ సమస్యతో బాధపడేవారని, ఆ రుగ్మత నుంచి బయటపడేందుకు ఆమె ఇమ్యూనో థెరపీ చేయించుకుంటున్నట్లు వెల్లడించారు.