15 July, 2026 | 3:02 AM

శైలానికి పోటెత్తుతున్న వరద..!

29-08-2024 01:08 PM

పది గేట్లు 10 ఫీట్ల మేర నీరు విడుదల

నాగర్ కర్నూల్, విజయక్రాంతి: ఎగువ నుండి భారీగా వరద తాకిడి వల్ల జూరాల జలాశయం నుండి శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో గురువారం శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు పది గేట్లను 10 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఎగువ జూరాల నుండి 3,82,783 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా ప్రస్తుతం 215 టీఎంసీలు 884 అడుగుల మేర నీటి నిల్వ చేస్తూనే 2,80,270 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేయడంతో కృష్ణమ్మ సాగర్ వైపు పరుగులు పెడుతుంది.