7 May, 2026 | 2:06 PM

Breaking News

కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •   మంత్రి జూపల్లి చేతికి బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి   •   ఐమాక్స్ లైట్లు ఏర్పాటుకు భూమి పూజ   •   ‘విజయ్ అనే నేను’.. సీఎం పీఠం ఖాయం?   •   కేంద్రమంత్రి బండి సంజయ్‌పై కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •  

మావోయిస్టు కదలికలపై దృష్టి

24-03-2025 11:41 PM

ఆకస్మిక తనిఖీ..

వెంకటాపురం పోలీస్ స్టేషన్ రికార్డుల పరిశీలిన.. 

అక్రమ ఇసుక తరలిస్తే కఠిన చర్యలు..

ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ..

నగూరు వెంకటాపురం (విజయక్రాంతి): నేర నియంత్రణ, పరిశోధనలో భాగంగా సోమవారం ఏటునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఐ.పి.ఎస్ వెంకటాపురం పోలీస్ స్టేషన్ ని సందర్శించి ఆకస్మికంగా స్టేషన్ రికార్డ్స్, 5 (S) ఆర్టికల్ పరంగా మెన్ యొక్క పనితీరుని చెక్ చేసారు. దీనితో పాటు వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నిఘా నేత్రాలైన సిసిటివి పనితీరుని పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ ద్వారా చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా అధికారులు ఎల్లవేళలా అప్రమత్తంగా, సన్నద్ధంగా ఉండాలని, వారు తమ సిబ్బంది గ్రామాలను సందర్శించినప్పుడు భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. 

ములుగు జిల్లాలో మావోయిస్టుల కదలికలపై అనునిత్యం దృష్టి సారించాలని, గ్రామాలలో వారి రాకపోకలపై కన్నేసి ఉంచాలని, మావోయిస్టులు అమాయక ఆదివాసి ప్రజలను ప్రభావితం చేయకుండా కఠిన చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. గతంలో కేసులలో అరెస్ట్ అయిన మావోయిస్టు పార్టీ సభ్యులను, సానుభూతిపరులను అనునిత్యం పర్యవేక్షిస్తుండాలని ఆదేశించారు. అదేవిధంగా వెంకటాపురం గోదావరి నది పరివాహక ప్రాంతమైనందున ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించాలని, అక్రమంగా ఇసుక తరలించే వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని, వారి వాహనాలను సీజ్ చేయాలని, వారికి సహకరిస్తున్న  వారి పైన కూడా చర్యలు తీసుకోవాలని, ఇసుక క్వారీ లపైన ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం సి.ఐ బండారి కుమార్, వెంకటాపురం ఎస్.ఐ కె. తిరుపతి రావు, సివిల్, సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.