4 July, 2026 | 3:04 AM

ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై దృష్టి పెట్టండి

04-07-2026 02:12 AM

మొయినాబాద్, జూలై 3(విజయక్రా ంతి): నూతన ఎంఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు గౌడ్‌ను పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా సన్మానించారు. మొయినాబాద్ మున్సిపల్ చైర్మన్ గరుగు రాజు, కౌన్సిలర్ కల్లెంల జగపతి, నాయకులు చదువు రాంచందర్, గునుగుర్తి కిరణ్లు నూతన ఎంఈఓకు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, వా టిని బలోపేతం చేయడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరారు.

ప్రభుత్వ పా ఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, విద్యార్థుల భవిష్యత్ ప్రగతికి కృషి చేయాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.