28 August, 2026 | 2:01 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

బీఆర్‌ఎస్ నాయకుడికి పరామర్శ

04-07-2026 02:13 AM

జైపాల్ రెడ్డి మాతృమూర్తికి ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి ఘన నివాళి

మాడ్గుల, జులై 3(విజయక్రాంతి): బిఆర్‌ఎస్ పార్టీ  మాడ్గుల మండల అధ్యక్షుడు జైపాల్ రెడ్డి మాతృమూర్తి ఎమి రెడ్డి పెద్ద లక్ష్మమ్మ గురువారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం మాడుగుల మండలం, చంద్రాయన్పల్లి గ్రామంలోని జైపాల్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అక్కడ లక్ష్మమ్మ భౌతికకాయానికి పూలమాల వేసి ఈ సందర్భంగా దివంగతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని గోలి శ్రీని వాస్ రెడ్డి ప్రార్థించారు.

అనంతరం జైపాల్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులను ప రామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టకాలంలో కుటుంబ స భ్యులంతా ధైర్యంగా ఉండాలని, పార్టీ పరం గా తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. నివాళి కార్యక్రమం మరియు పరామర్శలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, సింగిల్ విండో చైర్మన్ తిరుమల్ రెడ్డి, నాయకులు లాల య్య,కృష్ణారెడ్డి, యాది రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి పోశయ్య  అవురుపల్లి సర్పంచ్‌యాద య్య, కొండల్ రెడ్డి  పాల్గొన్నారు.