26 August, 2026 | 1:30 PM

బాధితుడికి ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆర్థిక సాయం

26-08-2026 12:22 PM

ఆమనగల్లు, అగస్టు25(విజయక్రాంతి): కల్వకుర్తి నియోజకవర్గం వెల్డండ మండలం ​రాచూరు గ్రామానికి చెందిన మాడుగుల జయరామ్‌కు రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఇంటి నిర్మాణం కోసం రూ. 10,000 ఆర్థిక సాయం అందజేశారు. ఇటీవల బాధితుడు ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం చేయాలంటూ విన్నవించారు. ఆపదలో ఉన్న వారికి తాను అండగా ఉంటానని...రాబోయే రోజుల్లో కూడా పేద ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. బాధితుడి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకుని, ధైర్యంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ​మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్,​బీఆర్ఎస్ నాయకులు నాగులు నాయక్,​ఏఎంసీ మాజీ డైరెక్టర్ సుభాష్,​మాజీ సర్పంచ్ పవన్ కుమార్ రెడ్డి,రవి తదితరులు పాల్గొన్నారు.