26 August, 2026 | 1:18 PM

మండల యువతకు పోలీస్ శాఖలో చేరుటకు చక్కని అవకాశం

26-08-2026 12:33 PM

పోలీస్ శాఖలో SI, PC ఉద్యోగాల కోసం ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు 

గుండాల, (విజయక్రాంతి): మండలంలోని యువత పోలీస్ శాఖలో సబ్‌ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (SI), పోలీస్ కానిస్టేబుల్ (PC) ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులందరికీ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ నిర్వహించబడుతుందని గుండాల ఎస్ హెచ్ వో శ్రవణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యం ఉన్న మండల యువత ఈ అకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆర్థిక ఇబ్బందులతో సంబంధం లేకుండా అర్హత కలిగిన ప్రతీ అభ్యర్థికి ఉచితంగా శిక్షణ అందించబడుతుందని ఆయన పేర్కొన్నారు. 

గుండాల పీఎస్ లో దరఖాస్తుల స్వీకరణ

గుండాల పోలీస్ స్టేషన్‌లో ఈ దరఖాస్తులు స్వీకరించడానికి చివరి తేదీ: 30.08.2026, అర్హత పరీక్ష ఉంటుంది. పరీక్ష తేదీ: 06.09.2026 జరుగుతుంది. ధరఖాస్తుకు అవసరమైన పత్రాలు సర్పించాల్సి ఉంటుంది. 

దరఖాస్తుతో పాటు క్రింది ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులను సమర్పించాలి:

1. ఆధార్ కార్డు జిరాక్స్

2. ఇంటర్మీడియట్ మెమో జిరాక్స్

3. డిగ్రీ మెమో జిరాక్స్ 

గుండాల మండలంలోని అర్హత కలిగిన యువతీ,యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోలీస్ శాఖలో SI, PC ఉద్యోగాలు సాధించే దిశగా కృషి చేయాలని శ్రవణ్ కుమార్ మండల యువతకు పిలుపునిచ్చారు