మాజీ ఎంపీపీ ఇంట్లో చోరీ
26-08-2026 12:38 PM
మల్దకల్ ఆగస్టు26,(విజయక్రాంతి): జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలో మాజీ ఎంపీపీ రాజారెడ్డి కృష్ణారెడ్డి ఇంట్లో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు వెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు తిరిగి వచ్చి చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై కొండ శ్రీహరి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. చోరీకి గురైన నగదు, బంగారు ఆభరణాల వివరాలు తెలియాల్సి ఉంది. నిందితుల కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






