2 May, 2026 | 9:08 PM

Breaking News

బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •   అంగన్వాడి కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీ   •   ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం   •   సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలి   •   ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ కృష్ణారెడ్డి   •   వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం   •  

ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..

01-11-2024 12:02 PM

30 విద్యార్థుల అస్వస్థత.

సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని పలువురి ఆరోపణ

కుమ్రంభీంఆసిఫాబాద్, (విజయ క్రాంతి): వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు బుధవారం రాత్రి ఫుడ్ పాయిజన్ అయింది. సాయంత్రం భోజనానంతరం 30 విద్యార్థులు ఒక్కసారిగా కడుపు నొప్పితో కూడిన వాంతులు విరోచనాలు చేయడంతో స్థానిక ఏఎన్ఎం పరీక్షించి వాంకిడి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. చికిత్స అనంతరం 27 మంది విద్యార్థులు కోలుకోగా అందులో ఇద్దరు వాంకిడి. మరో ఒకరు ఆసిఫాబాద్ ప్రభుత్వ దవాఖానాలో చికిత్స పొందుతున్నారు. విద్యార్థుల అస్వస్థతకు

ఫుడ్ పాయిజన్. కలుషితమైన తాగునీరె కారణమని పలువురు విద్యార్థులు ఆరోపించారు. వంటగది. వంట సామాగ్రి అశుభ్రతతో పాటు విద్యార్థులకు తాగునీరు అందించే వాటర్ ట్యాంక్ నెలల తరబడి శుభ్రం చేయకుండా నీరు అందిస్తున్నారని వాపోయారు. గతంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్న. బయట రాకుండా సిబ్బంది జాగ్రత్తపడ్డారనే విమర్శలు ఉన్నాయి.ఇక స్థానికంగా ఉండి విద్యార్థుల అలానపాలనా చూసుకోవాల్సిన వార్డెన్ స్థానికంగా ఉండకుండా కాగజ్ నగర్ నుంచి రోజు రాకపోకలు చేస్తున్నారు. దీంతో హాస్టల్ పర్యవేక్షణతో విద్యార్థులను పట్టించుకోనే వారు కరువయ్యారు.