1 March, 2026 | 8:15 PM

ఆహార భద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

01-03-2026 12:00 AM

రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి

రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 28( విజయక్రాంతి): ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణ మే లక్ష్యంగా ఆహార భద్రత చట్టాన్ని రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కమిషన్ సభ్యులతో కలిసి రంగారెడ్డి జిల్లాలోని సరూర్ నగర్, హయత్ నగర్ మండలాల్లో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి, విక్టోరియా మెమోరియల్ హాస్టల్, అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ దుకాణాలను సం దర్శించి రికార్డులను, స్టాక్ నిల్వలను పరిశీలించారు.

పాఠశాలలు, అంగన్వాడీల్లో ప్రభు త్వం నిర్ణయించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారాన్ని విద్యార్థులకు, గర్భిణు లకు, బాలింతలకు అందించాలని స్పష్టం చేశారు. ఈ-పోస్ లావాదేవీలు, స్టాక్ రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలని, లబ్ధిదారు లకు సకాలంలో బియ్యం అందేలా చూడాలని సూచించారు.  కార్యక్రమంలో ఆర్డీఓలు అనంత్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి వనజాత మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.