యువత విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి
ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): యువత విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శనివారం కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, మై భారత్ కేంద్ర, హైదరాబాద్, భారత ప్రభుత్వం సహకారంతో ఐషూ ఫౌండేషన్ ఆద్వర్యంలో భోలక్ పూర్ డివిజన్ పరిధిలోని ఘంటసాల క్రీడా మైదానంలో ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ యువకులు ప్రతీ రోజూ వ్యాయామం, క్రీడలను దినచర్యలో భాగం గా అలవాటు చేసుకోవాలని, శారీరక ధృడత్వాన్ని కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మై భారత్ కేంద్ర, హైదరాబాద్ యువజన అధికారి మిస్. కుష్బూ సింగ్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మయాంక్, జాతీయ యువజన పురస్కార గ్రహీతలు పానుగంటి మహేష్, గంజి రాజేందర్, ప్రభాకర్, కంటేస్టేడ్ కార్పొరేటర్ నవీన్, శంకర్ గౌడ్, విద్యాదీప్ స్కూల్ ప్రిన్సిపాల్ అంకిత్ రెడ్డి, మాధవి, తదితరులు పాల్గొన్నారు.




