లంచం తీసుకున్న బీట్ ఆఫీసర్!
01-03-2026 12:00 AM
- అడవిలో పశువులను మేపడానికి తీసుకున్నాడన్న రైతులు
- చర్యలు తీసుకోవాలని డిమాండ్
- రైతుల కాళ్లు మొక్కిన బీట్ ఆఫీసర్!
కామారెడ్డి, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): అడవిలో పశువులను మేపడానికి అనుమతి కోసం బీట్ ఆఫీసర్ డబ్బులు తీసుకున్నాడని, డబ్బులు ఇస్తేనే పశువులను మేపేందుకు అవకాశం కల్పిస్తున్నాడని కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతులు ఆరోపిస్తున్నారు.
బీట్ ఆఫీసర్ రైతుల నుంచి ఓ రూ.5 వేలు, రూ. 10 వేలు వేర్వేరుగా రెండుసార్లు ఫోన్ పే చే యించుకుని, పశువులను మేపుకునేందుకు అనుమతి ఇచ్చాడని రైతులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి ఆఫీసర్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. దీంతో దిగివచ్చిన బీట్ ఆఫీసర్ రైతుల కాళ్లపై పడి, ఫిర్యాదు చేయోద్దని ప్రాధేయపడినట్టు తెలిసింది.




