పశువులలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం
10-04-2026 04:15 PM
పెంచికలపేట,(విజయక్రాంతి): పెంచికల్పేట్ మండలంలోని కమ్మర్గాం, నందిగాం గ్రామాలలో ఉన్న నాలుగు నెలల వయసు పైబడిన పశువులకు,గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగముగా ఈ రోజు గేదెలకు టీకాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సులోచన భాస్కర్ గౌడ్ మండల పశు వైద్య అధికారి డాక్టర్ రాకేష్ ,రైతులు మధునయ్య, బాపు,పశువైద్య సిబ్బంది ఆనంద్ రావు,శివ కుమార్, శేఖర్ పాల్గొనడం జరిగింది.




