16 July, 2026 | 2:50 PM

ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్యా బోధన

16-07-2026 02:47 PM

జగదేవపూర్,(విజయక్రాంతి): జగదేవపూర్ మండల పరిధిలోని పీర్లపల్లి గ్రామంలో మండల విద్యాధికారి  సైదులు, సర్పంచ్ ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రి ప్రైమరీ తరగతులను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎంఈఓ సైదులు మాట్లాడుతూ సర్పంచ్ ప్రత్యేక చొరవ  చూపడం వాళ్ళే ప్రి ప్రైమరీ మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. నేటి నుండి ప్రైమరీ పాఠశాలలో నర్సరీ నుండి 5 వ తరగతి వరకు తరగతులా నిర్వహణ ఉంటుంది అన్నారు. తల్లి తండ్రులు ప్రైవేట్ పాఠశాలకు బస్సులో పంపకుండా ప్రభుత్వ పాఠశాలకు పంపాలి అని సూచించారు. అనంతరం సర్పంచ్ ఓం ప్రకాష్ మాట్లాడుతూ ప్రి ప్రైమరీ మంజూరు చేసిన ప్రభుత్వనికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. తప్పకుండ గ్రామంలోని పిల్లలను మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకునేలా చర్యలు తీసుకుని గ్రామాన్ని అభివృద్ధి  చేస్తాం అని తెలిపారు.