అటవీ అమరవీరుల దినోత్సవంలో జిల్లా కలెక్టర్ అంకిత్
రిజన హక్కుల రక్షణ దిశగా పనిచేయాల
ఆధునిక సాంకేతికతతో నేరాల నియంత్రణకు చర్యలు
కొత్తగూడెం సెప్టెంబర్ 11 (విజయక్రాంతి ): విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన అటవీ శాఖ అధికారుల,త్యాగాలు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని,శుక్రవారం కొత్తగూడెం ఇల్లందు క్రాస్‌రోడ్స్ లోని చలమల శ్రీనివాసరావు మెమోరియల్ సెంట్రల్ పార్క్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో,నిర్వహించిన జాతీయ అమరవీరుల సంస్మరణ సభకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన, అమరవీరులు చలమల శ్రీనివాసరావు విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్ నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అమరవీరుల కుటుంబ సభ్యులు, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ* , దేశవ్యాప్తంగా అటవీ సంపదను కాపాడే క్రమంలో అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. వారి త్యాగాలను స్మరించుకోవడం, వారి సేవలను భావితరాలకు తెలియజేయడం మనందరి బాధ్యత అని అన్నారు.
కార్యక్రమంలో జిల్లా ఎస్పి రోహిత్ రాజు,జిల్లా అటవీ అధికారి సిధార్డ్ విక్రమ్ సింగ్ , అటవీ శాఖ అధికారులు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, ఇతర అటవీ శాఖ సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.