మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్లో నో వాటర్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేస్తుందో
మేడ్చల్ మున్సిపల్ పట్టణ బిజెపి నాయకుల సూటి ప్రశ్న
మేడ్చల్ అర్బన్ సెప్టెంబర్ 11(విజయక్రాంతి):సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పట్టణంలో త్రాగు నీరు లేవు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేస్తుందోనని మున్సిపల్ అధికారులను మున్సిపల్ పట్టణ బిజెపి నాయకులు సూటిగా ప్రశ్నించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడ్చల్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పట్టణంలోని మేడ్చల్. కిస్టాపూర్-పూడూరు డివిజన్ లలో గత 5 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడం అత్యంత ఆందోళనకర విషయమని వారు చెప్పారు.పట్టణ ప్రజలకు త్రాగు నీరు అందించాల్సిన విషయంలో సంబధిత శాఖల మధ్య సమన్వయ లోపం, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కనిపిస్తున్న ఆలస్యం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని బిజెపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేడ్చల్ మున్సిపల్ పట్టణాన్ని కోట్ల రూపాయలతో అభివృద్ది చేశామని వాల్ పోస్టర్ లు వేసుకోవడం కాదు మేడ్చల్ ప్రజలకు కనీసం త్రాగునీరు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలసత్వం వహించడం సిగ్గుచేటని వారు చెప్పారు.మేడ్చల్ మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిజంగా ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే వాటర్ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి (HMWSSB) వారితో తక్షణమే త్రాగునీటి సరఫరా బాధ్యతను చేపట్టేలా ఎందుకు ప్రయత్నం చేయడం లేదని బిజెపి నాయకులు అడుగుతున్నారు.
వెంటనే మేడ్చల్ మున్సిపల్ పట్టణ ప్రజలకు త్రాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని లేని యెడల ప్రజల పక్షాన బిజెపి పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ పట్టణ బిజెపి సీనియర్ నాయకులు కొండమ్ ఆంజనేయులు ముదిరాజ్.రామన్నగారి శ్రీనివాస్ గౌడ్.సర్వేశ్వర్ రెడ్డి.మైసరి రాజు వంజరి.చెరువుకొమ్ము శ్రీనివాస్ గౌడ్.సాకరబోయిన వెంకటేష్.నర్సింగ్.నరసింహా తదితరులు పాల్గొన్నారు