చిన్నారుల మట్టి గణపతి ల తయారీ
11-09-2026 | 04:13pm
ఖానాపూర్ (విజయక్రాంతి): శ్రీ విద్యానికేతన్ ఒలంపియాడ్ పాఠశాలలో వినాయక చవితిని పురస్కరించుకొని చిన్నారులు మట్టి విగ్రహాలను తయారు చేశారు. ఈ సందర్భంగా వివిధ ఆకృతులలో చిన్నారులు చేసిన వినాయకుడు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్యాంప్రకాష్(Principal Shyamprakash) వినాయక చవితి పండుగ గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం మాట్లాడుతూ ప్లాస్టర్ ప్యారిస్ వల్ల జరిగే అనర్ధాలను విద్యార్థులకు తెలిపారు. ప్లాస్టర్ పారిస్ గణపతులను చెరువులలో నిమజ్జనం చేయడం పట్ల నీరు కలుషితమై అనారోగ్యాలు దరిచేరుతాయని అన్నారు.ప్రతి ఒక్కరు మట్టి గణపతి లను ప్రతిష్టించాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు ఉన్నారు.