21 April, 2026 | 4:17 PM

Breaking News

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •   భిక్కనూరులో 77 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   మంత్రి ఉత్తమ్ కేసీఆర్ కోవర్ట్: ఎంపీ అర్వింద్   •   ఘనంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం   •   ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడదాం   •   జహీరాబాద్ లో పీజీ సెంటర్ ఏర్పాటు: మంత్రి దామోదర్ రాజనర్సింహ   •   33% మహిళా రిజర్వేషన్ లో సామాజిక న్యాయం పాటించాలి   •   అభిమాని కుమారుడు కేశఖండనానికి వెళ్లిన ఎమ్మెల్యే   •   జీవన్ రెడ్డి.. పచ్చి తెలంగాణ వ్యతిరేకి.. వెయ్యి ఏండ్లయినా BRS పార్టీ మారదు   •   విద్యార్థులకు మెనూ ప్రకారం పరిశుభ్రమైన ఆహారం అందించండి   •  

డివిజన్ల ఏర్పాటు ఆగమాగం!

06-06-2025 12:52 AM

- ప్రజాభిప్రాయమే లేకుండా నిర్ణయం

- కొత్తగూడెం నగర పంచాయతీలో గందరగోళం

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 5 (విజయ క్రాంతి); కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం నగర పంచాయతీ,( కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్) లో డివిజన్లో ఏర్పాటు హడావుడి... ఆగమాగం అన్నట్లు ఉందని ఆరోపణలు వెలబడుతున్నాయి.

ఓటర్ల ప్రాతిపదికన డివిజన్లు ఏర్పాటు చేయడంతో ఓకే ఏరియాలో రెండు, మూడు డివిజన్లుగా విభజన జరుగుతోందని, భౌగోళిక ప్రాతిపదికన కాకుండా, ఓటర్లు, ఇంటి నెంబర్ల ప్రాతిపదికన అధికారులు కార్యాలయంలో కూర్చుని, ప్రజాభి ప్రాయ సేకరణ లేకుండా, ఏకపక్షంగా, అం తా రహస్యంగా, ఒక పార్టీ ఆదేశాల మేరకు అధికారులు డివిజన్లు చేస్తున్నారనే విమర్శ లు వెలువడుతున్నాయి. ఒక్కటి, రెండు రో జుల్లో డివిజన్ల ముసాయిదాను ప్రకటించనుండడంతో ఓటర్లలో గందరగోళం నెలకొంది.

60 డివిజన్లుగా కొత్తగూడెం కార్పొరేషన్ 

పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలతోపాటు సుజాతనగర్ మండలంలోని నిమ్మలగూడెం, మంగపేట, నరసింహసాగర్, నాయకులగూడెం, సుజాతనగర్ లక్ష్మీదే వి పల్లి, కోమటిపల్లి గ్రామపంచాయతీలను కలుపుతూ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తూ తాజాగా ప్రభుత్వం జీవో జారీ చేశారు.

త్వరలో మున్సిపల్, కా ర్పొరేషన్లకు ఎన్నికలు జరిగే అవకాశం ఉ న్నందున కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం కా ర్పొరేషన్ లో డివిజన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించారు. ఆదేశాల మేరకు అధికారులు కసరతు ప్రా రంభించారు. కొత్తగూడెం కార్పొరేషన్ లో మొత్తం 60 డివిజన్లుగా విభజిస్తున్నారు. పా ల్వంచ మున్సిపాలిటీలో 27, కొత్తగూడెం మున్సిపాలిటీలో 29, సుజాతనగర్ మండలంలో 4 డివిజన్లుగా ఏర్పాటు చేసేలా కసర త్ చేపట్టారు.

కార్పొరేషన్ లో 1,34,011 మంది ఓటర్లు 

పాల్వంచ మున్సిపాలిటీలో 61, 240 మంది ఓటర్లు, కొత్తగూడెం మున్సిపాలిటీలో 63, 750, సుజాతనగర్ లో 9, 021 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 1,34,011 మంది ఓటర్లతో కొత్తగూడెం మున్సిపల్ కా ర్పొరేషన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పాల్వంచ మున్సిపాలిటీలో డివిజన్ల ఏర్పాటులో అధికార యంత్రాంగం తల మునకైంది.

ఇక్కడే తిరకాసు వస్తోంది. ఓటర్ల ప్రాతిపదికన, ఇంటి నెంబర్లనే ప్రామాణికంగా డివి జన్ ఏర్పాటు చేయడం కారణంగా ఒకే ఏరియా రెండు మూడు డివిజన్లుగా విడిపోతున్నాయి. దేనితో ఓటర్లలోను, ప్రజల్లోనూ గందరగోళం నెలకొంది. అధికారులు ప్రజాభిప్రాయం మేరకు కాకుండా ఓ రాజకీయ పార్టీ నేత చెప్పిన రీతిలో డివిజన్ల ఏర్పాటు చేపట్టారని సర్వత్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఓకే ఏరియాలో రెండు మూడు డివిజన్లు..

పాల్వంచ మున్సిపాలిటీనీ 27 డివిజన్లుగా ఏర్పాటు చేస్తున్నారు. డివిజన్ల విభజన గందరగోళంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. భౌగోళిక ప్రాతిపదికన కాకుండా ఇంటి నెంబర్లు ఓటర్ల ప్రాతిపదికన డివిజన్లను ఏర్పాటు చేయటం తో ఒకే ప్రాంతం రెండు, మూడు డివిజన్లుగా విడిపోతున్నా యి. చాకలి బజారు ఏరియా 26వ డివిజన్ ,27వ డివిజన్ పరిధిలోకి వచ్చింది. గట్టాయిగూడెం ఏరియా 19, 24 ,25 డివిజన్ల గా విడిపోయింది. ఒడ్డుగూడెం ప్రాంతం 24, 25 డివిజన్ల పరిధిలోకి వచ్చింది.

మున్సిపాలిటీ పరిధిలోని కుంటినాగులగూడెం ప్రాం తాన్ని ఏ డివిజన్లోనూ కలపకుండా వదిలివేశారు. దీంతో పాల్వంచ పట్టణం లోని ఓటర్లు గందరగోళంలో పడుతున్నారు. ఒకే ప్రాంతాన్ని ఒకే డివిజన్ పరిధిలోకి తీసుకువస్తే ఆశించిన అభివృద్ధి తో పాటు ప్రజా ప్రతినిధులకు జవాబుదారేతనం ఉంటుందని, ఓటర్లు అయోమయం నుంచి బయట పడతారని అభిప్రాయం ప్రజల్లో మెండుగా ఉంది.